Trending:


ఇరా రికార్డు త్రిశతకం

వన్డేలలో ఒక జట్టు అంతా కలిసి 300 పరుగుల స్కోరు చేయడానికి ఎంతో శ్రమించాలి. కానీ ముంబైకి చెందిన 14 ఏండ్ల యువ క్రికెటర్‌ ఇరా జాదవ్‌ మాత్రం.. ఒక్కతే 346 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేలలో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కింది.


సత్తాచాటిన తెలంగాణ

జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం(జేఎన్‌ఎస్‌)లో 34వ జాతీయ సీనియర్‌ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు బోణీ కొట్టింది. శనివారం జరిగిన మహిళల డబుల్‌ ఈవెంట్‌లో తెలంగాణ 2-0తో ఢిల్లీపై అద్భుత విజయం సాధించింది.


మార్చి 21న ఐపీఎల్ 2025 షురూ.. మే 25న ఫైనల్..!!

ఐపీఎల్ 2025 తేదీల్లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. తొలుత మార్చి 14 నుంచి లీగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించింది. తాజాగా వారం ఆలస్యంగా లీగ్‌కు తెరలేవనున్నట్లు వెల్లడించింది. ఫైనల్ మ్యాచ్ మే 25న జరగనుంది. ప్రారంభ మ్యాచ్‌తో పాటు ఫైనల్ కూడా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.ప్లే ఆఫ్స్‌లో మిగతా రెండు మ్యాచ్‌లు హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరగనున్నాయి. అయితే, త్వరలో పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది.


BCCI | చీఫ్‌ సెలెక్టర్‌, హెడ్‌కోచ్‌తో టీమిండియా కీలక భేటీ..! రోహిత్‌, విరాట్‌పై చర్చించే ఛాన్స్‌..!

BCCI | ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 1-3 తేడాతో ఓటమిపాలైంది. హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అధికారులతో శనివారం కీలక సమావేశం నిర్వహించబోతున్నది.


Jasprit Bumrah | చాంపియన్స్‌ ట్రోఫీలో బుమ్రా డౌటే..! ఎన్‌సీఏకు వెళ్లాలని ఫాస్ట్‌బౌలర్‌కు బీసీసీఐ సూచన..!

Jasprit Bumrah | టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా చాంపియన్స్‌ ట్రోఫీకి అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తున్నది. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన చివరి టెస్టు సమయంలో బుమ్రా వెన్నునొప్పి బారినపడ్డాడు. ఆ తర్వాత వెంటనే స్కానింగ్‌ కోసం ఆసుపత్రికి వెళ్లాడు.


WPL వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే ఏ భారత బ్యాటర్‌కు సాధ్యం కాని రికార్డు.. 14 ఏళ్ల బాలిక సంచలనం

దేశవాళీ వన్డే క్రికెట్‌లో సంచలన రికార్డు నమోదైంది. ఏ భారత బ్యాటర్‌కు కూడా సాధ్యం కాని రికార్డును.. ముంబైకి చెందిన 14 ఏళ్ల మహిళా క్రికెటర్‌ ఇరా జాదవ్‌ సాధించింది. వన్డేల్లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచింది. అండర్‌-19 వన్డే ట్రోఫీలో ముంబై తరఫున బరిలోకి దిగిన ఈ ప్లేయర్.. మేఘాలయతో మ్యాచ్‌లో 157 బంతుల్లో 346 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీంతో ముంబై ఘన విజయం సాధించింది.


విశ్రాంతి ఇవ్వాలా..? వద్దా..? BCCIకి కొత్త తలనొప్పి..!

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక బీసీసీఐకి తలనొప్పిగా మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరామం లేకుండా ఆడిన ప్లేయర్లకు విశ్రాంతి ఇద్దామంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ అడ్డంకిగా మారింది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ఆడితేనే.. సన్నాహకం బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కేఎల్ రాహుల్.. తనకు విశ్రాంతి ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ తిరస్కరించినట్లు తెలుస్తోంది.


షమీ ఆగయా.. 14 నెలల తర్వాత జట్టులోకి

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం శనివారం భారత క్రికెట్‌ జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈనెల 22 నుంచి మొదలవుతున్న సిరీస్‌ కోసం సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కారణంగా నిరుడు వన్డే ప్రపంచకప్‌ తర్వాత నుంచి జట్టుకు దూరమైన సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ తిరిగి జట్టులోకి వచ్చాడు.


సిరీస్‌ లక్ష్యంగా నేడు భారత్‌, ఐర్లాండ్‌ రెండో వన్డే

ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌పై భారత మహిళల జట్టు కన్నేసింది. ఆదివారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ జరుగనుంది.


Tamim Iqbal | చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు బంగ్లాదేశ్‌కు షాక్‌.. రిటైర్మెంట్‌ ప్రకటించిన తమీమ్‌ ఇక్బాల్‌..

Tamim Iqbal | చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు బంగ్లాదేశ్‌కు షాక్‌ తగిలింది. తమీమ్‌ ఇక్బాల్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు మరోసారి రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఇంతకు ముందు గతేడాది జూలైలో రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం విధితమే.


IND vs ENG T20 Series | ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. 14 నెలల తర్వాత షమీ రీ ఎంట్రీ..

IND vs ENG T20 Series | ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో ఈ నెల 22న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ జరుగనున్నది. ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ 14 నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి చేరాడు.


IND W Vs IRE W | రాజ్‌కోట్‌ వన్డేలో చరిత్ర సృష్టించిన వుమెన్స్‌ టీమ్‌.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారీ స్కోర్‌ చేసిన టీమిండియా..!

IND W Vs IRE W | రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది.


Gautam Gambhir | కొంచెం ఊపిరితీసుకోనివ్వండి..! గంభీర్‌కు అండగా దినేశ్‌ కార్తీక్‌

Gautam Gambhir | భారత జట్టు హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై ఇటీవల మాజీలతో పాటు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్ట్‌ సిరీస్‌ పాలైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.


భారత్‌ బోణీ

దేశ రాజధాని ఢిల్లీ ఆతిథ్యమిస్తున్న మొదటి ఖోఖో ప్రపంచకప్‌ పోటీలు సోమవారం అట్టహాసంగా మొదలయ్యాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ కాగడాను వెలిగించి ఈ పోటీలను అధికారికంగా ప్రారంభించారు. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య భారత్‌.. ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో ఐదు పాయింట్ల తేడాతో నేపాల్‌ను ఓడించి బోణీ కొట్టింది.


ICC On Wide Ball | వైడ్‌ బాల్‌ రూల్స్‌ని మార్చబోతున్నాం.. వెల్లడించిన ఐసీసీ క్రికెట్‌ కమిటీ సభ్యుడు షాన్‌ పోలాక్‌..!

ICC on Wide Ball | క్రికెట్‌లో నిబంధనలు ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉన్నాయి. దాంతో బౌలర్లు ఇబ్బందిపడుతుంటారు. వైడ్‌ బాల్స్‌ విషయంలోనూ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగానే రూల్స్‌ ఉన్నాయి. అయితే, బౌలర్స్‌కు కొంత ప్రయోజనం కలిగించేలా ఐసీసీ నిబంధనల్లో మార్పులు చేయబోతున్నది.


వాడీవేడిగా బీసీసీఐ రివ్యూ మీటింగ్.. కెప్టెన్సీపై మాట ఇచ్చిన రోహిత్ శర్మ..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ప్రదర్శనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలు హాజరైనట్లు తెలుస్తోంది. ఇందులో దేశవాళీ క్రికెట్‌లో సీనియర్లు ఆడటంతో పాటు.. టీమిండియా భవిష్యత్ కెప్టెన్‌‌గా ఎవరు ఉండాలనే విషయమై చర్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని నెలలు తానే కెప్టెన్‌గా ఉంటానని బీసీసీఐతో రోహిత్ శర్మ చెప్పినట్లు సమాచారం.


IND W Vs IRE W | ఐర్లాండ్‌తో వన్డేలో అరుదైన ఘనత సాధించిన ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ..!

IND W Vs IRE W | భారత్‌-ఐర్లాండ్‌ వేదికగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో ఆదివారం రెండో మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా వుమెన్స్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ దీప్తి శర్మ అరుదైన ఘనత మైలురాయిని సాధించింది.


Devajit Saikia | టెస్ట్‌ ఫార్మాట్‌లో టీమిండియా గాడినపడడం సవాలే : బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్‌ సైకియా..

Devjit Saikia | టెస్టుల్లో భారత జట్టు ఇబ్బందిపడుతోందని బీసీసీఐ కొత్త కార్యదర్శి దేవ్‌జిత్‌ సైకియా అంగీకరించారు. రెడ్‌ బాల్‌ ఫార్మాట్‌లో జట్టు మళ్లీ గాడినపడడం ఓ సవాల్‌గా అని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో టీమిండియా ఘోరంగా ఓటమిపాలైంది.


IPL 2025 | ఐపీఎల్‌ 2025 సీజన్‌పై కీలక ప్రకటన చేసిన రాజీవ్‌ శుక్లా..!

IPL 2025 | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) 2025 సీజన్‌పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా కీలక సమాచారం అందించారు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ ఆలస్యంగా ప్రారంభమవుతుందని వెల్లడించారు.


K Annamalai | హిందీ భాషపై అశ్విన్‌ వ్యాఖ్యలు.. అన్నామలై ఏమన్నారంటే..?

K Annamalai | హిందీ భాషపై క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తెలిపారు.


క్యాచ్ పడితే రూ.90 లక్షలు.. దక్షిణాఫ్రికా లీగ్‌లో ఫ్యాన్స్‌కు బంపరాఫర్‌..!

జనవరి 9 నుంచి దక్షిణాఫ్రికా వేదికాగ మొదలైన టీ20 లీగ్‌లో నిర్వహకులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. స్టేడియానికి ఫ్యాన్స్‌ను రప్పించడమే లక్ష్యంగా క్యాచ్ పడితే భారీగా నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. బ్యాటర్‌ కొట్టిన సిక్స్‌ను ఒంటిచేత్తో అందుకంటే రూ.90 లక్షలు ఇస్తామని వెల్లడించారు. అయితే ఈ ఆఫర్‌ను టోర్నీ ప్రారంభమైన మూడో రోజుల్లోనే ఇద్దరు ఫ్యాన్స్ గెలుచుకోవడం గమనార్హం.


Watch Video: వినూత్న రీతిలో ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన కివీస్..!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు కెప్టెన్ శాంట్నర్.. వచ్చి మైదానంలో కూర్చుని.. ఒక్కో ఆటగాడి పేరును వెల్లడించాడు. ఈ వీడియోను కివీస్ క్రికెట్ బోర్డు షేర్ చేసింది. కాగా ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుంది. తొలి మ్యాచ్ ఆతిథ్య పాకిస్థాన్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ టోర్నీని హైబ్రిడ్‌ విధానంలో నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.


భారత్‌ రికార్డు విజయం

స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత మహిళల జట్టు 2-0తో సిరీస్‌ను దక్కించుకుంది. ఆదివారం రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా.. 116 పరుగుల భారీ తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. రికార్డు స్థాయిలో 50 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 370 పరుగులు చేసింది.


Kapil Dev | రెండు తరాల క్రికెటర్ల మధ్య పోలిక సాధ్యం కాదు.. : మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌

Kapil Dev | టీమిండియా రెండు తరాల క్రికెటర్లను పోల్చి చూడలేమని మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అన్నారు. ఇంగ్లాండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో యశస్వి జైస్వాల్‌, రిషబ్‌ పంత్‌ను పక్కన పెట్టిన విషయం తెలిసిందే.


కివీస్‌పై శ్రీలంక గెలుపు

న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో శ్రీలంక 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.


నేటి నుంచే ఇండియా ఓపెన్‌

ఈ ఏడాది రెండో బీడబ్ల్యూఎఫ్‌ ఈవెంట్‌ అయిన ఇండియా ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌కు మంగళవారం తెరలేవనుంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నేటి నుంచి ప్రారంభం కాబోయే ఈ ఈవెంట్‌లో భారత్‌ భారీ బృందాన్ని బరిలోకి దింపింది. ఏకంగా 21 మంది షట్లర్లు ఇండియా ఓపెన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


చాంపియన్‌ 12 కార్ప్స్‌ ట్రూప్స్‌

ఆర్మీ సదరన్‌ కమాండ్‌ ఇంటర్‌ వాలీవాల్‌ చాంపియన్‌షిప్‌లో12 కార్ప్స్‌ ట్రూప్స్‌ జట్టు విజేతగా నిలిచింది.


బీసీసీఐ కార్యదర్శిగా సైకియా

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా దేవ్‌జిత్‌ సైకియా, కోశాధికారిగా ప్రభ్‌తేజ్‌ సింగ్‌ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో సెక్రటరీ పదవిని జై షా నిర్వహించగా అతడు ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికవడంతో బీసీసీఐ కార్యదర్శిగా వైదొలిగాడు.


Ravindra Jadeja | టెస్టులకు రవీంద్ర జడేజా గుడ్‌బై చెప్పబోతున్నాడా..? ఇన్‌స్టాలో సంచలన పోస్ట్‌..!

Ravindra Jadeja | టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్టులకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చేసిన పోస్ట్‌ను బట్టి తెలుస్తున్నది. జడేజా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా టెస్ట్‌ జెర్సీని షేర్‌ చేశాడు.


Champions Trophy | చాంపియన్స్‌ ట్రోఫీకి దక్షిణాఫ్రికా జట్టు ఎంపిక..

Champions Trophy | ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. టెంబా బావుమా నాయకత్వంలో ఐసీసీ ఈవెంట్‌లో దక్షిణాఫ్రికాలోకి బరిలోకి దిగనున్నది. గాయాలతో జాతీయ జట్టుకు దూరమైన ఫాస్ట్‌ బౌలర్లు లుంగీ ఎంగిడీ, అన్రిచ్ అన్రిచ్ నోర్ట్జేను సైతం ఎంపిక చేసింది.


IND W vs IRE W | రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం..

IND W vs IRE W | ఐర్లాండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళా జట్టు విజయం సాధించింది. 116 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్నది. ఇక సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఈ నెల 15న రాజ్‌కోట్‌ వేదికగా జరుగనున్నది.


Robin Uthappa | విరాట్‌ కోహ్లీ వల్లే అంబటి రాయుడి కెరీర్‌ నాశనం..! రాబిన్‌ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు..!

Robin Uthappa | టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీపై మాజీ ఆటగాడు రాబిన్‌ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2019 వరల్డ్‌ కప్‌ జట్టులో తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడుకు అవకాశం దక్కకపోవడానికి విరాట్‌ కోహ్లీయే కారణమని ఆరోపించాడు. అతని కెరియర్‌ నాశనం అవడానికి కారణం విరాట్‌ కారణమని వ్యాఖ్యానించాడు.


సెమీస్‌కు తెలంగాణ

హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న 34వ సీనియర్‌ నేషనల్‌ సెపక్‌తక్రా జాతీయ స్థాయి పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన ఉమెన్‌ రెగ్యు ఈవెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు.


Shreyas Iyer | ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌

Shreyas Iyer | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ప్రాంచైజీ జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.


Champions Trophy | చాంపియన్స్‌ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్‌..

Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ జట్టును ఆదివారం ప్రకటించింది. జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సీనియర్‌ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు ఈ జట్టులో చోటు కల్పించలేదు. ఇటీవల బౌలింగ్‌ యాక్షన్‌ అనుమానాస్పదంగా ఉన్నది.


IPL | మార్చి 21 నుంచి ఐపీఎల్‌.. మే 25న కోల్‌కతాలో ఫైనల్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌ మార్చి 21న మొదలవనుంది. మార్చి 21 నుంచి మే 25 దాకా ఈ మెగాలీగ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ మేరకు గతంలో ప్రకటించిన తేదీ(మార్చి 14) లో స్వల్ప మార్పులు చేసింది.


ఆ ఇద్దరి ఫిట్‌నెస్‌పై ఆందోళన

వచ్చే నెల మొదలుకానున్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇప్పటికే అన్ని దేశాలూ తమ ప్రాథమిక జట్లను ప్రకటించాయి. కానీ బీసీసీఐ మాత్రం గడువు తేదీ (జనవరి 12) ముగిసినా జట్టును ప్రకటించకపోగా తమకు మరికొంత సమయం కావాలని ఐసీసీని కోరింది. ఈనెల 18 లేదా 19న భారత జట్టును ప్రకటించే అవకాశముంది.


ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ఎంపికకు నేడే ఆఖరి రోజు.. టీమిండియా పరిస్థితేంటి?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు ఎంపికపై బీసీసీఐ దృష్టి సారించింది. వాస్తవానికి ప్రాథమిక జట్టును ప్రకటించడానికి ఇవాళే ఆఖరి రోజు. కానీ ప్రస్తుతం టీమిండియా ప్రధాన బౌలర్ బుమ్రా ఫిట్‌నెస్‌పై స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో జట్టు ప్రకటన ఉంటుందా? ఉంటే అందులో ఎవరెవరు ఉంటారు? మళ్లీ మార్పులు చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.


RJ Mahvash | యుజ్వేంద్ర చహల్‌తో డేటింగ్‌ వార్తలపై స్పందించిన ఆర్‌జే మహ్వాష్‌

RJ Mahvash | టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చహల్‌ ఇటీవల వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. తన భార్య ధనశ్రీతో విడిపోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఈ క్రికెటర్‌ ఓ ఆర్‌జే ప్రేమలో మునిగితేలుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆర్‌జే మహ్వాష్‌తో పార్టీ చేసుకుంటున్న ఫొటోలు బయటకు వచ్చాయి.


షమీ వచ్చేశాడోచ్.. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..!

గాయం కారణంగా సుమారు ఏడాదికి పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ పేసర మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో అతడు మళ్లీ భారత జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌లు టీ20 సిరీస్‌కు భారత సెలక్షన్ కమిటీ శనివారం రాత్రి జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది.


Ira Jadav | U19 క్రికెట్‌లో ముంబయి బ్యాటర్‌ ఇరా జాదవ్‌ విధ్వంసం.. 157 బంతుల్లో ట్రిపుల్‌ సెంచరీ..!

Ira Jadav | భారత అండర్‌-19లో సరికొత్త రికార్డు నమోదైంది. 14 సంవత్సరాల ముంబయి బ్యాట్స్‌ వుమెన్‌ ఇరా జాదవ్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. బెంగళూరు వేదికగా ముంబయి-మేఘాలయ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరా జాదవ్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో.. బౌలర్లను ఊచకోత కోసింది.


రాయుడికి 2019 వరల్డ్ కప్‌ జెర్సీ ఇచ్చాక.. కోహ్లీ తప్పించాడు: రాబిన్‌ ఉతప్ప సంచలనం

Robin Uthappa: టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు విరాట్ కోహ్లీపై సంచలన ఆరోపణలు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో తెలుగు ప్లేయర్ అంబటి రాయుడుకు చోటు దక్కకపోవడానికి కోహ్లీనే కారణమని వ్యాఖ్యానించాడు. కోహ్లీకి ఎవరైన నచ్చకపోతే.. జట్టు నుంచి తప్పిస్తాడని ఉతప్ప పేర్కొన్నాడు. అంబటి రాయుడు విషయంలోనూ అదే జరిగిందని కుండ బద్దలు కొట్టాడు. కాగా అప్పట్లో రాయుడి ప్లేసులో త్రీడీ ప్లేయర్‌ అంటూ విజయ్ శంకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.


ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు.. షమీ వచ్చేశాడు

Mohammad Shami: గాయం కారణంగా సుమారు ఏడాదికి పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ పేసర మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో అతడు మళ్లీ భారత జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత సెలక్షన్ కమిటీ శనివారం రాత్రి జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది.


జై షా ప్లేసు రీప్లేస్.. కొత్త కార్యదర్శిని ఎన్నుకున్న బీసీసీఐ

BCCI Secretary: బీసీసీఐకి కొత్త కార్యదర్శి వచ్చేశారు. జై షా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే. సర్వ సభ్య సమావేశం నిర్వహించిన బీసీసీఐ.. కార్యదర్శి, కోశాధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. బీసీసీఐ నూతన కార్యదర్శిగా దేవజిత్‌ సైకియా, బీసీసీఐ కోశాధికారిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సమావేశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు పాల్గొన్నారు.


BCCI | బీసీసీఐ కార్యదర్శిగా దేవ్‌జిత్‌ సైకియా నియామకం

BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త కార్యదర్శిగా మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దేవ్‌జిత్ సైకియా నియామకమయ్యారు. ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో సైకియా ఎన్నికయ్యారు.


కెప్టెన్ నెంబర్‌ 17.. పంజాబ్‌ కింగ్స్‌ కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌

ఐపీఎల్ 2025 సీజన్‌కు గానూ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్ నియమితుడయ్యాడు. ఈ మేరకు పంజాబ్‌ కింగ్స్‌ ప్రకటన విడుదల చేసింది. ఇక పంజాబ్ కింగ్స్ నిర్ణయంతో శ్రేయస్ అయ్యర్‌ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో మూడు జట్లకు కెప్టెన్‌గా ఎంపికైన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా మూడో ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు జయవర్దనే, జార్జ్ బెయిలీలు కూడా మూడు జట్లను నడిపించారు. మార్చి 21 నుంచి ఐపీఎల్‌ 2025 ప్రారంభం కానుంది.


ICC Champions Trophy | చాంపియన్స్‌ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా కమ్మిన్స్‌..

ICC Champions Trophy | ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి క్రికెట్‌ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు కెప్టెన్‌గా పాట్‌ కమ్మిన్స్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇ


Yograj Singh | భారత్ ప్రపంచకప్‌ గెలిచి యువరాజ్‌ సింగ్‌ మరణించినా గర్వపడేవాడిని

Yograj Singh | యువరాజ్‌ సింగ్‌..! భారత మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లలో అత్యుత్తమమైన ఆటగాడు. యువరాజ్‌ సింగ్‌ రిటైర్‌మెంట్ తర్వాత ఆ లోటును ఇప్పటివరకు మరే ఆటగాడు కూడా పూడ్చలేదు. 2011లో భారత్‌ ప్రపంచకప్‌ గెలువడంలో యువరాజ్‌ సింగ్‌ కీలకపాత్ర పోషించాడు.


సాత్విక్‌ జోడీ నిష్క్రమణ

మలేషియా బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌, చిరాగ్‌ ద్వయం 10-21, 15-21తో కొరియా జోడీ కిమ్‌వోన్‌ హో, సియో సంగ్‌ చేతిలో ఓటమిపాలైంది.


సబలెంక, జ్వెరెవ్‌ శుభారంభం

సీజన్‌ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలి రోజు స్టార్‌ ప్లేయర్లు మొదటి రౌండ్‌ విఘ్నాన్ని విజయవంతంగా దాటారు. మహిళల సింగిల్స్‌లో గత సీజన్‌ ఫైనలిస్టులు అరీనా సబలెంక, కిన్వెన్‌ జెంగ్‌ శుభారంభం చేశారు. మెల్‌బోర్న్‌లోని రాడ్‌లీవర్‌ ఎరీనా వేదికగా జరిగిన మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో ఒకటో సీడ్‌ సబలెంక.. 6-3, 6-2తో స్లోన్‌ స్టీఫెన్స్‌ (యూఎస్‌)ను వరుస సెట్లలో చిత్తు చేసింది.