స్పోర్ట్స్

Trending:


IND vs USA | అర్ష్‌దీప్ డ‌బుల్ స్ట్ర‌యిక్.. ప‌వ‌ర్ ప్లేలో అమెరికా స్కోర్..?

IND vs USA : న్యూయార్క్ పిచ్‌పై లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ (Arsh Singh) చెల‌రేగుతున్నాడు. బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై రెండు వికెట్లు తీసి అమెరికాను ఒత్తిడిలోకి నెట్టాడు.


భారత్‌ ఫిఫా ఆశలు ఆవిరి

ఫిఫా వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో ఆడేందుకు గాను ఆసియా రీజియన్‌ నుంచి మూడో రౌండ్‌కు అర్హత సాధించాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత్‌ 2-1 తేడాతో ఖతార్‌ చేతిలో ఓటమిపాలైంది.


వరల్డ్ కప్ టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్.. వర్షంతో మ్యాచ్ రద్దు, బాబర్ సేన ఇంటికి

T20 world cup - Pakistan Out: టీ20 ప్రపంచకప్‌ 2024లో సూపర్‌-8కు వెళ్లాలనే పాకిస్థాన్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. శుక్రవారం ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన యూఎస్‌ఏ, ఐర్లాండ్‌ మ్యాచ్‌.. వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకూ చేరో పాయింట్‌ దక్కింది. ఫలితంగా 5 పాయింట్లతో లీగ్‌ స్టేజ్‌ను ముగించిన యూఎస్‌ఏ సూపర్‌-8కు అర్హత సాధించింది. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌తో పాటు అమెరికా సూపర్‌-8కు అర్హత సాధించింది. యూఎస్‌ఏ దెబ్బకు పాకిస్థాన్‌ లీగ్‌ స్టేజ్‌ నుంచే...


పారిస్‌కు భారత షూటింగ్‌ సైన్యమిదే

పారిస్‌ ఒలింపిక్స్‌లో ఈసారి దేశానికి కచ్చితంగా పతకాలు సాధిస్తారని భావిస్తున్న క్రీడలలో ఒకటిగా ఉన్న ‘షూటింగ్‌'లో బరిలోకి దిగబోయే ఆటగాళ్ల పేర్లను జాతీయ రైఫిల్‌ సమాఖ్య (ఎన్‌ఆర్‌ఏఐ) మంగళవారం వెల్లడించింది.


నేడు కెనడాతో భారత్‌ మ్యాచ్‌.. కోహ్లీ ఫామ్‌ అందుకునేనా..!

T20 World Cup 2024 India vs Canada Match: టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా తన చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడేందుకు భారత్‌ సిద్ధమైంది. నేడు ఫ్లోరిడా వేదికగా రాత్రి 8 గంటలకు కెనడాతో తలపడనుంది. ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడనే దానిపై అందరి దృష్టి నెలకొంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. తుఫాన్ ప్రభావంతో ఇదే వేదికలో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.


వివాదాస్పద గోల్‌పై ఫిఫాకు లేఖ

ఫిఫా వరల్డ్‌ కప్‌-2026 క్వాలిఫికేషన్‌ ఆసియా జోన్‌లో మూడో రౌండ్‌కు ముందంజ వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ ఓడగా.. ఈ మ్యాచ్‌లో ఖతార్‌ చేసిన వివాదాస్పద గోల్‌పై ఆలిండియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌).. ఫిఫాతో పాటు ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఎఫ్‌సీ)కు లేఖ రాసింది.


T20 World Cup 2024 | యువ ఓపెన‌ర్‌కు షాక్.. రింకూ సింగ్ జాక్‌పాట్

T20 World Cup 2024 : సూప‌ర్ 8 చేరిన రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) బృందం శ‌నివారం కెన‌డాతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు భార‌త మేనేజ్‌మెంట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్క్వాడ్ నుంచి ఇద్ద‌రిని త‌ప్పించింది.


భారత్‌-పాక్ మ్యాచ్‌పై యూట్యూబర్‌ ప్రశ్నలు.. కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు

India vs Pakistan: భారత్‌ - పాకిస్థాన్‌ మ్యాచ్‌పై ప్రజల స్పందనను తెలుసుకునేందుకు ప్రయత్నించి ఓ యూట్యూబర్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కరాచీలో జరిగింది. ఓ మొబైల్‌ మార్కెట్‌లోకి వెళ్లిన సదరు వ్యక్తి.. కనిపించిన ప్రతి ఒక్కరినీ మ్యాచ్‌ గురించి అడిగాడు. ఇదే క్రమంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డును కూడా పదే పదే ప్రశ్నించాడు. పలుమార్లు ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన సెక్యూరిటీ గార్డు.. యూట్యూబర్‌పై కాల్పులు జరిపాడు.


Nassau Stadium: ఇండోపాక్ మ్యాచ్‌కు వేదికైన‌ అమెరికా క్రికెట్ స్టేడియం కూల్చివేత‌..

Nassau Stadium: లో స్కోరింగ్ మ్యాచ్‌ల‌కు వేదికైన అమెరికాలోని న‌సావు స్టేడియాన్ని ఇవాళ్టి నుంచి తొల‌గించ‌నున్నారు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఇండో పాక్ మ్యాచ్ ఈ వేదిక‌పైనే జ‌రిగింది. న్యూయార్క్ లెగ్ మ్యాచ్‌లు ముగియ‌డంతో ఈ స్టేడియాన్ని తొల‌గిస్తున్నారు.


T20 World Cup: సంచలనాల ప్రపంచకప్.. సూపర్-8 వెళ్లే జట్లేవి.. వేటికి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

T20 World Cup 2024 Super 8: 2024 టీ-20 ప్రపంచ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే చిన్న జట్లుగా ఉన్న అఫ్గానిస్థాన్ న్యూజిలాండ్‌ను ఓడించడం, అమెరికా పాకిస్థాన్‌ను ఓడించడం వంటివి చూశాం. దీంతో ఆయా జట్లకు సూపర్-8 చేరే ఛాన్స్ కష్టంగా మారింది. మరోవైపు ఇండియా, సౌతాఫ్రికా వంటివి అలవోకగా తదుపరి దశకు చేరే అవకాశం ఉంది. ఇప్పుడు ఏయే జట్ల అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.


SL vs NPL | శ్రీలంకకు షాకిచ్చిన‌ వ‌రుణుడు.. సూపర్ 8లో ద‌క్షిణాఫ్రికా

SL vs NPL : పొట్టి ప్ర‌పంచ క‌ప్‌లో బోణీ కొట్టాల‌నే క‌సితో ఉన్న మాజీ చాంపియ‌న్ శ్రీ‌లంక‌ (Srilanka)కు వ‌రుణుడు భారీ షాక్ ఇచ్చాడు. టాస్ ప‌డ‌కుండానే బుధ‌వారం నేపాల్‌ (Nepal)తో జ‌ర‌గాల్సిన మ్యాచ్ రద్ద‌య్యింది.


Kamran Akmal: సిక్కుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన పాకిస్థాన్ క్రికెట‌ర్

Kamran Akmal: సిక్కుల‌పై చేసిన కామెంట్‌కు సారీ చెప్పాడు క‌మ్రాన్ అక్మ‌ల్‌. ఇండోపాక్ మ్యాచ్ టైంలో.. బౌల‌ర్ హ‌ర్ష‌దీప్‌పై అత‌ను అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో పాక్ క్రికెట‌ర్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఈ నేప‌థ్యంలోనే అక్మ‌ల్ సారీ చెబుతూ పోస్టు పెట్టాడు.


T20 World Cup | వరుణుడు కరుణించేనా ?.. పసికూన కెనడాతో భారత్‌ పోరు

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఐర్లాండ్‌పై శుభారంభం చేసిన టీమ్‌ఇండియా ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయంతో కదంతొక్కి, ఆతిథ్య అమెరికాను మట్టికరిపించి హ్యాట్రిక్‌ ఖాతాలో వేసుకుంది. కీలకమైన సూపర్‌-8కు ముందు పసికూన కెనడాతో భారత్‌ తలపడనుంది.


Team India | సూపర్‌-8లో భారత్‌.. యూఎస్‌ఏపై పోరాడి గెలిచిన టీమ్‌ ఇండియా

‘మినీ ఇండియా వర్సెస్‌ టీమ్‌ ఇండియా’గా అభిమానులు అభివర్ణించిన యూఎస్‌ఏ-భారత్‌ పోరులో రోహిత్‌ సేన ‘కష్టపడి’ గెలిచింది. ఆతిథ్య జట్టుకు ‘పసికూన’ ముద్ర ఇంకా చెరిగిపోకపోయినా, చేసింది తక్కువ స్కోరే (110) అయినా యూఎస్‌ఏ బౌలర్లు రెచ్చిపోవడంతో ‘మెన్‌ ఇన్‌ బ్లూ’కు విజయం అంత సులభంగా దక్కలేదు.


అప్ఘానిస్థాన్ విజయాల హ్యాట్రిక్.. టోర్నీ నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్..

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8కు అఫ్ఘానిస్థాన్ అర్హత సాధించింది. పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచులో గెలుపొందిన అఫ్ఘాన్.. టోర్నీలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. దీంతో వెస్టిండీస్‌ తర్వాత గ్రూప్-సి నుంచి సూపర్-8కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. ఇదే సమయంలో టోర్నీలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన కివీస్.. మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.


T20 World Cup | సూపర్‌-8లో సఫారీలు.. బంతితో ఆకట్టుకుని బ్యాట్‌తో తడబడిన బంగ్లా

అదే ఉత్కంఠ! అదే మజా! బౌలర్లకు స్వర్గధామంగా మారి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న న్యూయార్క్‌ పిచ్‌పై భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఆదివారం ముగిసిన ‘లో స్కోరింగ్‌ థ్రిల్లింగ్‌' మాదిరిగానే మరో ఉత్కంఠ పోరు క్రికెట్‌ అభిమానులను అలరించింది.


గెలిచి నిలిచిన పాక్‌

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు సమిష్టిగా రాణించి కెనడాపై 7 వికెట్ల తేడాతో గెలిచింది.


కలిసి ఆడనున్న నాదల్‌-అల్కారజ్‌

ప్రపంచ టెన్నిస్‌ అభిమానులకు స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌, యువ సంచలనం కార్లొస్‌ అల్కారజ్‌ శుభవార్త చెప్పారు. రాబోయే పారిస్‌ ఒలింపిక్స్‌లో ఈ ఇద్దరూ డబుల్స్‌ విభాగంలో జోడీ కట్టనున్నారని స్పెయిన్‌ టెన్నిస్‌ సమాఖ్య బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.


Watch Video: మ్యాచ్ ముగియగానే న్యూయార్క్ స్టేడియం నేలమట్టం.. అమెరికా టెక్నాలజీ చూశారా

India vs USA: టీ-20 వరల్డ్‌కప్ 2024లో 8 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన అమెరికాలోని న్యూయార్క్ స్టేడియాన్ని కూల్చివేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రపంచ కప్ కోసమే ఇక్కడ నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించగా.. ఇప్పుడు అక్కడ మ్యాచ్‌లు పూర్తి కావడంతో.. కూల్చివేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఇండియా, యూఎస్‌ఏ మ్యాచ్ ముగిసిన కాసేపటికే స్టేడియం వద్దకు బుల్డోజర్లు పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.


Roger Federer | టెన్నిస్ దిగ్గజ ఆట‌గాడు ‘ఫెదరర్‌’పై అమెజాన్ ప్రైమ్ డాక్యూమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

Roger Federer Documentory | టెన్నిస్ ఆట పేరు చెప్పగానే మ‌న‌కు ముందుగా గుర్తోచ్చే పేరు రోజర్ ఫెదరర్. కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌లను నెగ్గిన ఈ స్విస్‌ దిగ్గజ ఆట‌గాడు 2022లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పిన విష‌యం తెలిసిందే. ఇక ఆటకు వీడ్కోలు ప‌లికిన అనంత‌రం ప్ర‌స్తుతం కుటుంబంతో స‌మ‌యం గ‌డుపుతున్నాడు.


IND vs USA: దూబే ఖేల్‌ ఖతం.. అమెరికాతో మ్యాచ్‌ కోసం భారత జట్టులోకి ఐపీఎల్‌ హీరో..!

T20 Worldcup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024లో వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్.. మూడో మ్యాచుకు సిద్ధమైంది. నేడు న్యూయార్క్‌ వేదికగా అమెరికాతో తలపడనుంది. అయితే పాకిస్థాన్‌తో మ్యాచుతో పోలిస్తే ఈ మ్యాచుకు భారత్‌ తన తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశం ఉంది. పేలవ ప్రదర్శన చేస్తున్న శివమ్‌ దూబెను పక్కన పెట్టి సంజూ శాంసన్‌ను తీసుకునే అవకాశం ఉంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.


IND vs USA | గ‌ట్టెక్కించిన సూర్య‌.. పోరాడి ఓడిన‌ అమెరికా

IND vs USA టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఫేవ‌రెట్ టీమిండియా (Team India)కు ప‌సికూన‌ అమెరికా (USA) గ‌ట్టి స‌వాల్ విసిరింది. స్లో పిచ్‌పై క‌చ్చిత‌మైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌండ‌రీలకు బ్రేక్ వేశారు. సూర్య‌కుమార్ యాద‌వ్(50 నాటౌట్) ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా పోరాడి జ‌ట్టును గెలిపించాడు


సెహ్వాగ్ ఎవరో తెలీదన్న షకిబ్..! ఇచ్చిపడేస్తున్న టీమిండియా ఫ్యాన్స్.. !

టీమిండియా దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎవరో తెలీదంటూ కామెంట్ చేసిన బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకిబ్ అల్ హసన్‌పై నెటిజన్లు ట్రోల్స్ మొదలెట్టేశారు. దక్షిణాఫ్రికాతో మ్యాచులో సరిగా ఆడకపోవడంతో సెహ్వాగ్.. షకిబ్‌ను విమర్శించాడు. నెదర్లాండ్స్‌పై హాఫ్ సెంచరీతో చెలరేగిన షకిబ్.. సెహ్వాగ్‌కు కౌంటర్ ఇచ్చాడు. దీనిపై టీమిండియా ఫ్యాన్స్ సైతం ధీటుగా బదులిస్తున్నారు.


మెయిన్‌ డ్రాకు అభిషేక్‌

భారత యువ షట్లర్‌ అభిషేక్‌ యెలిగర్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించాడు.


పవర్‌లిఫ్టింగ్‌లో కార్మికురాలి ప్రతిభ

నాగపూర్‌లో ఇటీవల జరిగిన కోల్‌ఇండియా మహిళల పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో రాష్ర్టానికి చెందిన సాయిలత రజత పతకంతో మెరిసింది.


సాత్విక్‌ జోడీ నంబర్‌వన్‌ చేజారె

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంకు చేజిక్కించుకున్న భారత స్టార్‌ ద్వయం సాత్విక్‌సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి అగ్రస్థానాన్ని కోల్పోయారు.


టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ బోణీ.. 3.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన డిఫెండింగ్ ఛాంపియన్

Oman vs England In Google Trends: టీ20 ప్రపంచకప్‌ 2024 ప్రారంభమైన రెండు వారాల అనంతరం ఇంగ్లాండ్‌ జట్టు బోణీ కొట్టింది. డిఫెండింగ్‌ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఇంగ్లీష్‌ జట్టు తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించలేకపోయింది. కానీ ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3.1 ఓవర్లలోనే ఛేజ్‌ను పూర్తి చేసి.. నెట్‌ రన్‌రేట్‌ను భారీగా పెంచుకుంది. దీంతో ఆ జట్టు సూపర్‌-8 దిశగా కీలక ముందడుగు వేసింది.


IND vs PAK | దాయాదుల మ్యాచ్‌పై వీడియో.. యూట్యూబ‌ర్ కాల్చివేత‌

IND vs PAK : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా(Team India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ అభిమానుల‌కు మ‌స్త్ థ్రిల్‌నిచ్చింది. అయితే.. పాకిస్థాన్‌లో మాత్రం మ్యాచ్ రోజే విషాదం నెల‌కొంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల మ్యాచ్ ఓ యూట్యూబ‌ర్ (Youtuber) ప్రాణాలు బ‌లిగొన్న సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.


బంగ్లాదేశ్ కొంపముంచిన అంపైర్ నిర్ణయం.. అదే జరిగితే నాగిని డ్యాన్స్ చూసేవాళ్లం..!

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచులో అంపైర్లు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచులో బంగ్లాదేశ్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే అంపైర్ తీసుకున్న నిర్ణయం కారణంగా బంగ్లాదేశ్ 4 పరుగులు కోల్పోయింది. దీంతో ఆ జట్టు ఓడిపోయేందుకు అంపైర్లు తీసుకున్న నిర్ణయం, క్రికెట్ రూల్సే కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ మ్యాచులో ఏం జరిగింది? బంగ్లాదేశ్ వ్యతిరేకిస్తున్న ఆ నిబంధన ఏమిటి?


T20 World Cup 2024 | అడుగు దూరంలో అమెరికా.. పాకిస్థాన్ ఆశ‌ల‌న్నీ ఆ మ్యాచ్‌పైనే..!

T20 World Cup 2024 : పొట్టి ప్ర‌పంచ క‌ప్ పోటీల‌కు ఆతిథ్య‌మిస్తున్న అమెరికా (USA) చ‌రిత్ర‌కు అడుగు దూరంలో నిలిచింది. ఆతిథ్య జ‌ట్టు మ‌రో రెండు పాయింట్లు సాధిస్తే సూప‌ర్ 8కు దూసుకెళ్తుంది.


T20 World Cup 2024 | న్యూయార్క్‌లో సౌల‌త్‌లు నిల్.. టీమిండియాకు ప్రైవేట్ జిమ్

T20 World Cup 2024 : తొలిసారి పొట్టి ప్ర‌పంచ క‌ప్ పోటీల‌కు ఆతిథ్య‌మిస్తున్న అమెరికా (USA).. ఆట‌గాళ్ల‌కు అన్ని సౌల‌త్‌లు క‌ల్పించ‌డంలో తేలిపోయింది. దాంతో, టీమిండియా ఆట‌గాళ్ల‌ కోసం భార‌త క్రికెట్ బోర్డు (BCCI) ప్ర‌త్యేకంగా జిమ్ స‌భ్య‌త్వం తీసుకుంది.


చరిత్ర సృష్టించిన శృతి వోరా

భారత ఈక్వెస్ట్రియన్‌ (గుర్రపు స్వారీ) చరిత్రలో మరో సంచలనం. స్లోవేనియాలోని లిపికా వేదికగా ఈ నెల 7 నుంచి 9 వరకూ జరిగిన త్రీ స్టార్‌ గ్రాండ్‌ప్రి ఈవెంట్‌లో భారత ఈక్వెస్ట్రియన్‌ శృతి వోరా చాంపియన్‌గా నిలిచింది.


ముగిసిన భారత్‌ పోరాటం

ఆస్ట్రేలియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌-500 టోర్నీలో భారత షట్లర్ల టైటిల్‌ వేట క్వార్టర్స్‌ పోరుతోనే ఆగిపోయింది. శుక్రవారం జరిగిన పురుషుల, మహిళల, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో మన షట్లర్లు ఓడటంతో భారత్‌కు నిరాశ తప్పలేదు. పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌.. 21-19, 21-13తో నరొక (జపాన్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు.


వెస్టిండీస్ చేతిలో న్యూజిలాండ్ చిత్తు.. సూపర్-8 రేసు నుంచి ఔట్..!

T20 World Cup 2024 New Zealand vs West Indies Match: ఐసీసీ టోర్నీల్లో నిలకడకు మారుపేరైన న్యూజిలాండ్ జట్టు టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం దారుణ ప్రదర్శన చేస్తోంది. టోర్నీ తొలి మ్యాచులో అప్ఘానిస్థాన్ చేతిలో చాలా దారుణంగా ఓడిపోయిన న్యూజిలాండ్.. తాజాగా వెస్టిండీస్‌తోనూ గెలవలేకపోయింది. కివీస్ వరుసగా రెండు ఓటములతో గ్రూప్-సీ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. సూపర్-8 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.


Sunil Chhetri | నేడు భారత్‌, ఖతార్‌ పోరు.. ఛెత్రి లేకుండా తొలి మ్యాచ్‌!

సుమారు రెండు దశాబ్దాల పాటు భారత ఫుట్‌బాల్‌ జట్టుకు సేవలందించిన మాజీ సారథి సునీల్‌ ఛెత్రి లేకుండా ‘బ్లూ టైగర్స్‌' కీలక పోరుకు సిద్ధమైంది.


PAK vs CAN | ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. కెన‌డా బ్యాట‌ర్లు దంచేనా..?

PAK vs CAN : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు మ‌రికాసేప‌ట్లో తెర‌లేవ‌నుంది. న్యూయార్క్‌లో జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ సార‌థి బాబ‌ర్ ఆజాం(Babar Azam) బౌలింగ్ తీసుకున్నాడు.


Saurabh Netravalkar | ‘అందుకే భార‌త క్రికెట్.. ఐపీఎల్ వ‌దిలేశా’.. అమెరికా స్పీడ్‌స్ట‌ర్

Saurabh Netravalkar : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆతిథ్య (USA) అమెరికా సంచ‌ల‌న విజ‌యాల‌తో పెద్ద జ‌ట్ల‌కు స‌వాల్ విసురుతోంది. సంచ‌ల‌న‌ స్పెల్‌తో పాక్ బ్యాట‌ర్ల‌ను వ‌ణికించిన‌ సౌర‌భ్ నేత్రావ‌ల్క‌ర్ (Saurabh Netravalkar) సోష‌ల్ మీడియాలో మ‌స్త్ ట్రెండ్ అయ్యాడు.


T20 World Cup: అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్‌ రద్దయితే.. టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్

టీ20 ప్రపంచకప్ 2024కు వేదికైన అమెరికాలో కురుస్తోన్న భారీ వర్షాలు.. పాకిస్థాన్‌ క్రికెట్ టీమ్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇవాళ (శుక్రవారం) జరిగే యూఎస్ఏ, ఐర్లాండ్ మ్యాచ్‌కు వరణుడి ముప్పు పొంచి ఉంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దు అయితే మాత్రం అమెరికా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఇదే సమయంలో పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. పాక్ సూపర్-8 ఆశలు సజీవంగా ఉండాలంటే ఇవాళ్టి మ్యాచులో ఐర్లాండ్ తప్పకుండా గెలవాలి.


T20 WC Super 8: సూపర్-8లో ఇండియా vs ఆస్ట్రేలియా.. ముందే ఫిక్స్ చేశారుగా! రోహిత్ సేన ఎదుర్కొనే మరో 2 టీమ్‌లు ఇవే

India vs Australia: ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లీగ్ దశ ఆఖరి దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రతి గ్రూప్ నుంచి ఒక్కో టీమ్ సూపర్-8 కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. జూన్ 17తో లీగ్ స్టేజ్ ముగియనుంది. ఐసీసీ ఇచ్చిన ప్రీ-సీడింగ్ ఆధారంగా ఇప్పటికే సూపర్-8 లో తలబడబోయే కొన్ని జట్ల మ్యాచ్ డేట్లు వచ్చేశాయి. ఇండియా.. ఆస్ట్రేలియాతో కూడా ఆడనుంది. భారత్ ఎదుర్కోబోయే మరో రెండు జట్లు ఏంటో చూద్దాం.


Scotland | స్కాట్లాండ్‌ గెలుపు జోరు.. టీ20 ప్రపంచకప్‌లో ఒమన్‌పై ఘన విజయం

టీ20 ప్రపంచకప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.


Gulveer Singh | గుల్వీర్‌సింగ్‌ నయా నేషనల్‌ రికార్డు

గతేడాది హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత యువ అథ్లెట్‌ గుల్వీర్‌ సింగ్‌.. 5000 మీటర్ల రేసులో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు.


రికర్వ్‌ జట్టుకు నిరాశ

పారిస్‌ ఒలింపిక్స్‌లో కోటా దక్కించుకునేందుకు ఆఖరి అవకాశమైన ఫైనల్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో భారత మహిళల రికర్వ్‌ జట్టు నిరాశపరిచింది. టర్కీలోని అంటాల్య వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో దీపికా కుమారి, భజన్‌ కౌర్‌, అంకితా భకత్‌తో కూడిన భారత జట్టు ప్రి క్వార్టర్స్‌లో 3-5తో ఉక్రెయిన్‌ చేతిలో ఓటమిపాలైంది.


భారత్‌కు 111 పరుగుల లక్ష్యం విధించిన యూఎస్‌ఏ.. అర్ష్‌దీప్ సింగ్‌కు 4 వికెట్లు

India vs USA: టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా న్యూయార్క్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ముందు 111 పరుగుల లక్ష్యం నిలిపింది యూఎస్‌ఏ జట్టు. ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోలు కష్టాల్లో పడ్డా.. అమెరికా జట్టు ఆటగాళ్లు కుదురుకొని 20 ఓవర్లు ఆడారు. 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లు తీశాడు.


England | ఇంగ్లండ్ జ‌ట్టులో ‘ఫ్లింటాఫ్’.. తండ్రిని మ‌రిపిస్తాడా..?

England : దిగ్గ‌జ క్రికెట‌ర్ల త‌న‌యులు వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుంటున్న‌ రోజుల‌వి. తాజాగా ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ (Andrew Flintoff) చిన్న‌ కుమారుడు అండ‌ర్-19 జ‌ట్టులోకి వ‌చ్చాడు.


USA vs IRE | అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ ఆల‌స్యం.. కార‌ణ‌మిదే..?

USA vs IRE : ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో ఫ్లోరిడా వేదిక‌గా అమెరికా(USA), ఐర్లాండ్(Ireland) త‌ల‌ప‌డుతున్నాయి. ఫ్లోరిడా పెద్ద వాన కార‌ణంగా అంపైర్లు షెడ్యూల్ ప్ర‌కారం రాత్రి 7:30 గంట‌ల‌కు వేయాల్సిన టాస్‌(Toss)ను వాయిదా వేశారు.


India vs USA Highlights: భారత్‌ను గెలిపించిన సూర్యకుమార్ యాదవ్.. పాక్ హ్యాపీ

Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్‌లో భారత్ మరో విజయాన్ని నమోదు చేసింది. న్యూయార్క్ వేదికగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరుసగా మూడు విజయాలతో సూపర్ 8 దశకు చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్ అర్ధ శతకంతో భారత్‌కు విజయాన్ని అందించాడు. అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. భారత్ విజయంతో పాకిస్థాన్‌కు మరో అవకాశం చిక్కింది.


ప్రపంచ జూనియర్‌ చెస్‌ విజేత దివ్య

ప్రపంచ జూనియర్‌ బాలికల చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన దివ్య దేశ్‌ముఖ్‌ విజేతగా నిలిచింది.


క్వార్టర్స్‌కు సుమిత్‌-సిక్కి జోడీ

భారత మిక్స్‌డ్‌ ద్వయం సుమిత్‌రెడ్డి-సిక్కిరెడ్డి ఆస్ట్రేలియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్స్‌కు చేరారు.


BWF Rankings | సాత్విక్ – చిరాగ్‌ జోడీకి షాక్.. సింధు ర్యాంక్ ఎంతంటే..?

BWF Rankings : భార‌త స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ (Satwik Sairaj) - చిరాగ్ శెట్టి (Chirag Shetty)కి పెద్ద షాక్. ఏడాది కాలంగా నిల‌క‌డ‌గా రాణిస్తున్న‌ ఈ స్టార్ ద్వ‌యం నంబ‌ర్ 1 ర్యాంక్ కోల్పోయింది.


Virat Kohli: 3 మ్యాచ్‌ల్లో 5 రన్స్‌.. కోహ్లీ ఫామ్‌పై సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు

Virat Kohli Form: టీ20 ప్రపంచకప్‌ 2024లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే స్కోరు చేశాడు. దీంతో అతడి ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై టీమిండియా దిగ్గజ ప్లేయర్‌ సునీల్ గావస్కర్‌ స్పందించాడు. కోహ్లీ ఫామ్‌ గురించి ఆందోళన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. సూపర్‌-8, సెమీస్, ఫైనల్‌లో చెలరేగిపోయే అవకాశం ఉందని పేర్కొన్నాడు.