BAJARANG PUNIA | రెజ్లర్ బజరంగ్‌ పూనియాపై సస్పెన్షన్‌ వేటు.. పారిస్‌ ఒలింపిక్స్‌కు వెళ్లేనా..?

Bajarang Punia : పారిస్‌ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాపై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్‌ పరీక్షకు శాంపిల్‌ ఇవ్వలేదన్న కారణంగా ‘నేషనల్ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (NADA)’ ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసింది. దాంతో మరికొన్ని రోజుల్లో జరగనున్న ప్రపంచ క్రీడోత్సవంలో బజరంగ్‌ పూనియా పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది.

అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు దేశీయంగా నాడా డోపింగ్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. అందుకోసం మార్చి 10న పూనియా నుంచి యూరిన్‌ శాంపిల్స్‌ను కోరింది. అయితే పూనియా శాంపిల్స్‌ ఇచ్చేందుకు నిరాకరించాడని నాడా తెలిపింది. అందుకే ఆయనను ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునేంతవరకు ఏ క్రీడా ఈవెంట్లలో పాల్గొనకుండా సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా పోరాడిన రెజ్లర్‌లలో బజరంగ్ పూనియా కూడా ఉన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని అప్పట్లో బజరంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌, వినేశ్‌ పొగట్‌ తదితరులు ఆందోళనకు దిగారు. దాంతో వినేశ్‌ పొగట్‌పై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు విచారణలో ఉంది.

2024-05-05T10:09:21Z dg43tfdfdgfd