ENGLAND | ఏఐతో జట్టు ఎంపిక.. ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ కొత్త ప్రయోగం

England | లండన్‌: అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) మన జీవితంలో నిత్యకృత్యం కాబోతున్నది. కృతిమ మేధతో ఇప్పటికే అనూహ్య మార్పులు చోటు చేసుకుంటుడగా, ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చింది. ఏఐ సహకారంతో జట్టును ఎంపిక చేస్తున్నట్లు ప్రధాన కోచ్‌ జాన్‌ లెవిస్‌ పేర్కొన్నాడు. లండన్‌కు చెందిన పీఎస్‌ఐ సంస్థ సహకారంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు జట్టును ఎంపిక చేశామని తెలిపాడు.

టెక్నాలజీ సహకారంతో కీలకమైన డేటాబేస్‌ అధారంగా చేసుకుంటూ జట్టు ఎంపిక జరిగిందని వివరించాడు. ఇందులో 2,50,000 శాంపిల్స్‌తో రకరకాల కూర్పులతో జట్లను కంపెనీకి పంపాము. పూర్తిగా డాటా విశ్లేషించిన తర్వాత టీమ్‌ను ఏఐ ప్రకటించింది. ఇంగ్లండ్‌ రగ్బీ యూనియర్‌, ఇంగ్లిష్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లలో ఇప్పటికే ఏఐ ద్వారా జట్లను ఎంపిక చేస్తున్నారు.

2024-05-04T20:07:09Z dg43tfdfdgfd