HARBHAJAN SINGH: ధోనీకి బ‌దులుగా పేస్ బౌల‌ర్‌ను తీసుకుంటే బెట‌ర్: హ‌ర్భ‌జ‌న్ సింగ్‌

ధ‌ర్మ‌శాల‌: పంజాబ్ కింగ్స్ లెవ‌న్‌తో ఆదివారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాట‌ర్ ఎంఎస్ ధోనీ.. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. టీ20 కెరీర్‌లో అత‌ను ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఇదే మొద‌టిసారి. అయితే ఆ స్థానంలో వ‌చ్చిన ధోనీ.. తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివ‌రి ఓవ‌ర్ల‌లో వ‌చ్చి భారీ షాట్ల‌తో అల‌రించే ధోనీ.. 9వ నెంబ‌ర్ స్థానంలో బ్యాటింగ్‌కు రావ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ధోనీ త‌న క‌న్నా ముందు మిచెల్ సాంట్న‌ర్, శార్దూల్ థాకూర్‌ల‌ను బ్యాటింగ్‌కు దింపారు. 19వ ఓవ‌ర్‌లో బ్యాటింగ్‌కు దిగాల్సిన స‌మ‌యంలో.. ధోనీ ఆ ఇద్ద‌ర్నీ ముందుకు పంప‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. మాజీ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్(Harbhajan Singh) ఆ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌పై ఫైర్ అయ్యారు.

ఒక‌వేళ ధోనీ 9వ నెంబ‌ర్‌లో ఆడుతున్న‌ప‌పుడు .. అత‌ని స్థానంలో మరో పేస్ బౌల‌ర్‌ను తీసుకోవ‌డం ఉత్త‌మం అని హ‌ర్భ‌జ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. శార్దూల్ అత‌ని కంటే ముందు ఆర్డ‌ర్ బ్యాటింగ్‌కు దిగాడ‌ని, ధోనీ లాంటి షాట్స్ శార్దూల్ ఆడ‌లేడ‌ని, కానీ ధోనీ ఎందుకు ఆ త‌ప్పు చేశాడో అర్థం కావ‌డం లేద‌ని హ‌ర్భ‌జ‌న్ పేర్కొన్నాడు. చెన్నైకి ప‌రుగులు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ధోనీ బ్యాటింగ్‌కు రావాల‌ని, ఎందుకంటే అత‌ను గ‌త మ్యాచుల్లో రాణించాడ‌ని, కీల‌క‌మైన పంజాబ్‌తో మ్యాచ్‌లో అత‌ను బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను ఎందుకు మార్చాడో తెలియ‌డం లేద‌ని హ‌ర్భ‌జ‌న్ పేర్కొన్నాడు.

2024-05-06T07:12:40Z dg43tfdfdgfd