LSG VS KKR | టాస్ గెలిచిన ల‌క్నో.. ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ స్థానంలో ఠాకూర్

LSG vs KKR : ప‌దిహేడో సీజ‌న్ 54 మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(KKR), ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(LSG) త‌ల‌ప‌డుతున్నాయి. ల‌క్నో వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేఎల్ రాహుల్(KL Rahul) బౌలింగ్ తీసుకున్నాడు. కోల్‌క‌తా ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. మ‌రోవైపు ల‌క్నో ఒక మార్పు చేసింది. గాయ‌ప‌డిన మ‌యాంక్ యాద‌వ్ స్థానంలో య‌శ్ ఠాకూర్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఫ్లే ఆఫ్స్ బెర్తుకు చేరువైన ఈ రెండు జ‌ట్లకు ఈ మ్యాచ్ కీల‌కం కానుంది.

కోల్‌క‌తా తుది జ‌ట్టు : సునీల్ న‌రైన్, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీప‌ర్), అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ, శ్రేయ‌స్ అయ్య‌ర్(కెప్టెన్), వెంక‌టేశ్ అయ్య‌ర్, రింకూ సింగ్, అండ్రూ ర‌స్సెల్, ర‌మ‌న్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, హ‌ర్షిత్ రానా.

ల‌క్నో తుది జ‌ట్టు : కేఎల్ రాహుల్(కెప్టెన్), మార్క‌స్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోల‌స్ పూర‌న్, అష్ట‌న్ ట‌ర్న‌ర్, ఆయుష్ బ‌దొని, కృనాల్ పాండ్యా, య‌శ్ ఠాకూర్, న‌వీన్ ఉల్ హ‌క్, ర‌వి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.

2024-05-05T13:54:54Z dg43tfdfdgfd