LSG VS KKR | న‌రైన్ హాఫ్ సెంచ‌రీ.. ల‌క్నో భారీ టార్గెట్ ఛేదించేనా..?

LSG vs KKR : ల‌క్నో గ‌డ్డ‌పై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(Kolkata Knight Riders) బ్యాట‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. ప్లే ఆఫ్స్ బెర్తుకు మ‌రింత చేరువైన జ‌ట్టుకు మ‌రో విజ‌యం అందించాల‌నే క‌సితో ఓపెన‌ర్ సునీల్ న‌రైన్(80) హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. మ‌రో ఓపెన‌ర్ ఫిలిప్ సాల్ట్(32), చివ‌ర్లో ర‌మ‌న్‌దీప్ సింగ్(25 నాటౌట్)లు ల‌క్నో బౌల‌ర్ల‌ను చీల్చిచెండాడారు. దాంతో, కోల్‌క‌తా మ‌రోసారి రెండొంద‌లు కొట్టింది. య‌శ్ ఠాకూర్ వేసిన 20వ ఓవ‌ర్లో ర‌మ‌న్‌దీప్ ఫోర్, సిక్సర్ బాద‌డంతో ల‌క్నో ముందు కోల్‌క‌తా 236 ప‌రుగుల లక్ష్యాన్ని ఉంచ‌గ‌లిగింది.

టాస్ ఓడిన కోల్‌క‌తాకు ఓపెనర్లు అదిరే ఆరంభ‌మిచ్చారు. ఎడాపెడా బౌండ‌రీలు బాదుతు స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. జ‌ట్టు స్కోర్ 61 వ‌ద్ద సాల్ట్ ఔటైనా న‌రైన్ జోరు త‌గ్గించ‌లేదు. హాఫ్ సెంచ‌రీ త‌ర్వాత మ‌రింద దూకుడుగా ఆడాడు. అయితే.. శ‌త‌కం దిశ‌గా వెళ్తున్న న‌రైన్ ఎట్ట‌కేల‌కు ర‌వి బిష్ణోయ్ ఓవ‌ర్లో వెనుదిరిగాడు. దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ చేతికి చిక్కాడు. దాంతో, 140 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

ఓపెన‌ర్ ఫిలిప్ సాల్ట్(32) ఔట‌య్యాక‌.. అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ(32)తో కలిసి న‌రైన్ కోల్‌క‌తా ఇన్నింగ్స్‌ను ప‌రుగులు పెట్టించాడు. ఏకంగా రెండో వికెట్‌కు 79 ప‌రుగులు జోడించి ప‌టిష్ట స్థితిలో నిలిపాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ ఆండ్రూ ర‌స్సెల్(12), రింకూ సింగ్‌(16)లు విఫ‌ల‌మైనా.. ఆఖ‌ర్లో ర‌మ‌న్‌దీప్ సింగ్(25 నాటౌట్), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(23)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దాంతో, కోల్‌క‌తా నిర్ణీత ఓవర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి ర‌న్స్ చేయ‌గ‌లిగింది. ల‌క్నో బౌల‌ర్ల‌లో న‌వీన్ ఉల్ హ‌క్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

2024-05-05T16:10:18Z dg43tfdfdgfd