LSG VS KKR | సొంత‌గ‌డ్డ‌పై 137కే ల‌క్నో ఆలౌట్.. టేబుల్ టాప‌ర్‌గా కోల్‌క‌తా

LSG vs KKR :  ప‌దిహేడో సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(Kolkata Knight Riders)హ్యాట్రిక్ విక్ట‌రీ కొట్టింది. ఆదివారం జ‌రిగిన డ‌బుల్ హెడ‌ర్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ను ఆల్‌రౌండ్ షోతో చిత్తు చేసింది. 98 ప‌రుగుల తేడాతో గెలుపొందిన కోల్‌క‌తా అగ్ర‌స్థానంలోకి దూసుకెళ్లి.. ప్లే ఆఫ్స్ బెర్తుకు మ‌రింత చేరువైంది. తొలుత సునీల్ న‌రైన్(80) వీర‌కొట్టుడుతో భారీ స్కోర్ చేసిన కోల్‌క‌తా.. ఆ త‌ర్వాత ల‌క్నో ప‌ని ప‌ట్టింది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి(3/30), హ‌ర్షిత్ రానా(3/24)లు చెల‌రేగ‌డంతో రాహుల్ సేన 137 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

కోల్‌క‌తా నిర్దేశించిన భారీ ఛేద‌న‌లో ల‌క్నోకు ఆదిలోనే స్టార్క్ షాకిచ్చాడు. అర్నిశ్ కుల‌క‌ర్ణి(9) ఆడిన బంతిని ర‌మ‌న్‌దీప్ సింగ్ ప‌రుగెత్తుతూ వెళ్లి అందుకున్నాడు. 20 ప‌రుగుల‌కే తొలి వికెట్ ప‌డిన జ‌ట్టును కెప్టెన్ కేఎల్ రాహుల్(25), మార్క‌స్ స్టోయినిస్(36) లు ఆదుకున్నారు. ఇద్ద‌రూ బౌండ‌రీలు బాదుతూ ర‌న్ రేట్ పెర‌గ‌కుండా చూశారు. స్టోయినిస్, రాహుల్ జోడీ దంచ‌డంతో ల‌క్నో ప‌వ‌ర్ ప్లేలో వికెట్ న‌ష్టానికి 55 ప‌రుగులు చేసింది.

ప‌వ‌ర్ ప్లే త‌ర్వాత కోల్‌క‌తా బౌల‌ర్లు వికెట్ల వేట మొద‌లెట్టారు. ర‌స్సెల్ త‌న తొలి ఓవ‌ర్లోనే స్టోయినిస్‌ను ఔట్ చేసి ల‌క్నోను మ‌రింత ఒత్తిలోకి నెట్టాడు. 85కే నాలుగు వికెట్లు ప‌డిన వేళ‌.. నికోల‌స్ పూర‌న్(10), కుర్రాడు ఆయుష్ బ‌దొని()లు.. జట్టు స్కోర్ వంద దాటించారు. అయితే.. 101 ర‌న్స్ వ‌ద్ద ర‌స్సెల్ డేంజ‌ర‌స్ పూర‌న్‌ను డ‌గౌట్‌కు పంపాడు. అంతే.. అక్క‌డితో ల‌క్నో ఓట‌మి ఖారారైంది. చివ‌ర్లో అష్ట‌న్ ట‌ర్న‌ర్(16), కృనాల్ పాండ్యా(5)లు పోరాడ‌తార‌నుకుంటే.. చ‌క్ర‌వ‌ర్తి, రానాలు వాళ్ల‌కు క‌ళ్లెం వేశారు. ఇక 16.1 ఓవ‌ర్‌లో ర‌వి బిష్ణోయ్‌ను రానా ఎల్బీగా ఔట్ చేయ‌డంతో కోల్‌క‌తా 98 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

తొలుత ల‌క్నో గ‌డ్డ‌పై ఆడిన‌ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. ఓపెన‌ర్ సునీల్ న‌రైన్(80) హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. మ‌రో ఓపెన‌ర్ ఫిలిప్ సాల్ట్(32) ఔట‌య్యాక‌.. అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ(32)తో కలిసి న‌రైన్ కోల్‌క‌తా ఇన్నింగ్స్‌ను ప‌రుగులు పెట్టించాడు. ఏకంగా రెండో వికెట్‌కు 79 ప‌రుగులు జోడించి ప‌టిష్ట స్థితిలో నిలిపాడు. చివ‌ర్లో ర‌మ‌న్‌దీప్ సింగ్(25 నాటౌట్)లు ల‌క్నో బౌల‌ర్ల‌ను చీల్చిచెండాడారు. దాంతో, కోల్‌క‌తా మ‌రోసారి రెండొంద‌లు కొట్టింది. య‌శ్ ఠాకూర్ వేసిన 20వ ఓవ‌ర్లో ర‌మ‌న్‌దీప్ ఫోర్, సిక్సర్ బాద‌డంతో ల‌క్నో ముందు కోల్‌క‌తా 236 ప‌రుగుల లక్ష్యాన్ని ఉంచ‌గ‌లిగింది. ల‌క్నో బౌల‌ర్ల‌లో న‌వీన్ ఉల్ హ‌క్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

2024-05-05T17:55:35Z dg43tfdfdgfd