MADRID OPEN | మ్యాడ్రిడ్‌ ఓపెన్‌ ఫైనల్‌లో స్వియాటెక్‌ VS సబలెంక

Madrid Open | మ్యాడ్రిడ్‌: టాప్‌ సీడ్స్‌ ఇగా స్వియాటెక్‌ (పోలండ్‌), అరీనా సబలెంక (బెలారస్‌) మరోసారి ఏటీపీ మాస్టర్స్‌ 1000 టోర్నీ ఫైనల్‌లో ‘ఢీ’కొనబోతున్నారు. స్పెయిన్‌ వేదికగా జరుగుతున్న మ్యాడ్రిడ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో రెండో సీడ్‌ సబలెంక 1-6, 7-5, 7-6 (7/5) తేడాతో రెండో సీడ్‌ ఎలీనా రిబాకినాను ఓడించి స్వియాటెక్‌తో తుది పోరుకు సిద్ధమైంది.

శనివారం ఈ ఇద్దరి మధ్య జరుగబోయే ఫైనల్‌.. గతేడాది ఇదే టోర్నీలో తుది పోరుకు రిైప్లె కానుంది. 2023లో ఈ ఇద్దరే ఫైనల్‌ ఆడగా అప్పుడు సబలెంక టైటిల్‌ నెగ్గింది. ఇక మ్యాడ్రిడ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ 6-4, 6-3 తేడాతో అమెరికాకు చెందిన 12వ సీడ్‌ ఫ్రిట్జ్‌ను ఓడించి ఫైనల్‌ చేరాడు.

2024-05-03T22:33:35Z dg43tfdfdgfd