MI VS KKR | కట్టుదిట్టంగా ముంబై బౌలింగ్‌.. వరుస వికెట్లు కోల్పోతున్న కోల్‌కతా

MI vs KKR | ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తోంది. దీంతో కోల్‌కతా వరుసగా వికెట్లను చేజార్చుకుంటుంది. కేవలం 5 ఓవర్లు ముగిసేలోపే 4 వికెట్లను కోల్పోయింది. పవర్‌ ప్లే పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 57 పరుగులు మాత్రమే చేసింది.

తుషారా వేసిన తొలి ఓవర్‌లో నాలుగో బంతికి ఫిలిప్‌ సాల్ట్‌ (5) తిలక్‌వర్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మూడో ఓవర్‌లో రెండో బంతికి రఘువంశీ (13) కూడా క్యాచ్‌ ఔటవ్వగా.. చివరి బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ (6) కూడా ఔటయ్యాడు. హార్దిక్‌ పాండ్యా వేసిన ఐదో ఓవర్‌లో రెండో బంతికి నరైన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

2024-05-03T14:32:21Z dg43tfdfdgfd