NITHISH REDDY | అవకాశాన్ని వృథా చేసుకోను: నితీశ్‌రెడ్డి

Nithish Reddy | హైదరాబాద్‌: ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున బ్యాట్‌తో పాటు బంతితోనూ అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌ రెడ్డి తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందుకుంటున్నాడు. గురువారం ఉప్పల్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో ముగిసిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 35 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. 42 బంతుల్లోనే 3 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేసి హైదరాబాద్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మ్యాచ్‌ ముగిశాక నితీశ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నన్ను నేను నిరూపించుకునేందుకు గాను గతేడాది నుంచి వేచి చూస్తున్నా. ఈ ఏడాది టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నాకు ఆ అవకాశం ఇచ్చింది. నేను దానిని వృథా చేసుకోదలుచుకోలేదు’ అని అన్నాడు.

2024-05-03T18:47:58Z dg43tfdfdgfd