PBKS VS CSK | దూబే గోల్డెన్ డ‌క్.. మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై

PBKS vs CSK : పంజాబ్ కింగ్స్‌తో ధ‌ర్శ‌శాల‌లో జ‌రుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌(Chennai Super Kings)కు వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతున్నాయి. ప‌వ‌ర్ ప్లేలో ఓపెన‌ర్ అజింక్యా ర‌హానే(9) వికెట్ కోల్పోయిన సీఎస్కే.. ఆ త‌ర్వాత మ‌రింత క‌ష్టాల్లో ప‌డింది. స్పిన్న‌ర్ రాహుల్ చాహ‌ర్ ఒకే ఓవ‌ర్లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

వ‌రుస బంతుల్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డేంజ‌ర‌స్ శివం దూబే(0)ను గోల్డెన్ డ‌క్‌గా వెన‌క్కి పంపాడు. దాంతో, అప్ప‌టిదాకా ప‌టిష్ట‌స్థితిలో ఉన్న చెన్నై.. 69 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయింది. ప్ర‌స్తుతం డారిల్ మిచెల్(28), మోయిన్ అలీ(1)లు ఆడుతున్నారు. 8 ఓవ‌ర్ల‌కు స్కోర్ .. 71/3.

2024-05-05T10:54:28Z dg43tfdfdgfd