RCB VS GT | గుజ‌రాత్ ప‌రువు కాపాడిన తెవాటియా, షారుఖ్.. ఆర్సీబీ టార్గెట్..?

RCB vs GT : సొంత‌మైదానమైన చిన్న‌స్వామిలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బౌల‌ర్లు చెల‌రేగారు. గుజ‌రాత్ టైటాన్స్ (Gujarat Titans) బిగ్ హిట్ట‌ర్ల‌కు క‌ళ్లెం వేసి స్వ‌ల్ప స్కోర్‌కే క‌ట్ట‌డి చేశారు. పేస‌ర్లు సిరాజ్, ద‌యాల్ విజృంభ‌ణ‌తో 87 ప‌రుగుల‌కే స‌గం వికెట్లు ప‌డినా.. షారుక్ ఖాన్(37), రాహుల్ తెవాటియా(35), డేవిడ్ మిల్ల‌ర్(30)ల పోరాడారు. ఒక‌ద‌శ‌లో 150 ప్ల‌స్ కొట్టేలా కనిపించిన గుజ‌రాత్ చివ‌ర్లో వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. ఆఖ‌రి ఓవ‌ర్లో ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్ విజ‌య్ శంక‌ర్ క్యాచ్‌ను సిరాజ్ ప‌ట్ట‌డంతో 148 ప‌రుగుల‌కే గుజ‌రాత్ కుప్ప‌కూలింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ఆదిలోనే క‌ష్టాల్లో ప‌డింది. సిరాజ్ వ‌రుస ఓవ‌ర్ల‌లో ఓపెన‌ర్లు వృద్ధిమాన్ సాహా(1) శుభ్‌మ‌న్ గిల్(2)లను పెవిలియ‌న్‌కు పంపాడు. ఫామ్‌లో ఉన్న‌ సాయి సుదర్శ‌న్(6) ఆ కాసేప‌టికే గ్రీన్ బౌలింగ్‌లో వికెట్ పారేసుకున్నాడు. ఆ త‌ర్వాత డేవిడ్ మిల్ల‌ర్(30), షారుక్ ఖాన్(27)లు గుజ‌రాత్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ జోడీని క‌ర‌న్ శ‌ర్మ విడదీసి ఆర్సీబీని ఊపిరి పీల్చుకోనిచ్చాడు.

తెవాటియా, ర‌షీద్ దంచగా..

గ‌త మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీ బాదిన షారుఖ్ సింగిల్ తీయ‌బోగా.. కోహ్లీ నేరుగా వికెట్ల‌ను గురి చూసి కొట్టాడు. దాంతో, అత‌డు నిరాశ‌గా పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. అప్ప‌టికీ గుజ‌రాత్ స్కోర్.. 88/5 . కీల‌క బ్యాట‌ర్లు డగౌట్‌కు చేరిన వేళ‌..  తెవాటియా, ర‌షీద్‌లు బ్యాట్ ఝులిపించి జ‌ట్టు స్కోర్ 100 దాటించారు.

వ‌రుస‌గా 4, 6, 4, 4

విజ‌య్ ఓవ‌ర్లో ర‌షీద్ భారీ సిక్స‌ర్ బాది ఊపు తేగా క‌ర‌న్ శ‌ర్మ వేసిన 16వ ఓవ‌ర్లో తెవాటియి రెచ్చిపోయాడు. వ‌రుస‌గా 4, 6, 4, 4 బాది 19 ర‌న్స్ పిండుకున్నాడు. వీళ్లు ఆరో వికెట్‌కు 29 బంతుల్లోనే 44 ర‌న్స్ జోడించారు. ద‌యాల్ బౌలింగ్‌లో ర‌షీద్ బౌల్డ్ అయ్యాక వ‌చ్చిన ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్ విజ‌య్ శంక‌ర్(10) ఓ బౌండ‌రీ కొట్టి గుజ‌రాత్ ప‌రువు కాపాడాడు.

2024-05-04T16:06:31Z dg43tfdfdgfd