RCB VS GT | మిల్ల‌ర్, షారుక్ ఔట్.. 13 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్..?

RCB vs GT : చిన్న‌స్వామి స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ త‌డ‌బ‌డుతూ సాగుతోంది. సిరాజ్ చెల‌రేగ‌డంతో 10 ప‌రుగుల‌కే ఓపెన‌ర్లను కోల్పోయిన గుజ‌రాత్‌ను క‌ర‌న్ శ‌ర్మ గ‌ట్టి దెబ్బ‌కొట్టాడు. డేంజ‌ర‌స్ హిట్ట‌ర్ డేవిడ్ మిల్ల‌ర్(30)ను ఊరించే బంతితో డ‌గౌట్‌కు చేర్చాడు. శ‌ర్మ ఓవ‌ర్లో ఫోర్ బాదిన మిల్ల‌ర్.. ఆ త‌ర్వాత భారీ షాట్ ఆడి మ్యాక్స్‌వెల్ చేతికి చిక్కాడు.

దాంతో, 80 వ‌ద్ద గుజ‌రాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ కాసేప‌టికే షారుక్ ఖాన్(37) ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. రాహుల్ తెవాటియా(6) ఆడిన బంతికి సింగిల్ తీయ‌బోగా.. కోహ్లీ నేరుగా వికెట్ల‌ను గురి చూసి కొట్టాడు. దాంతో, షారుక్ నిరాశ‌గా పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. 13 ఓవ‌ర్ల‌కు స్కోర్.. 88/5 .

2024-05-04T15:21:21Z dg43tfdfdgfd