TERROR THREAT | టీ20 ప్రపంచకప్‌కు ఉగ్రముప్పు.. స్పందించిన వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు

Terror Threat | ఈ ఏడాది జరగబోయే పొట్టి ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌, అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. జూన్‌ 1 నుంచి టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) ప్రారంభం కాబోతోంది. దీంతో ఇప్పటికే అన్ని దేశాలు ప్రపంకప్‌కు జట్లను ప్రకటించాయి. ఇక ఈ పొట్టి సమరానికి మరో 25 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ టోర్నీకి ఉగ్రముప్పు పొంచి ఉంది (Terror Threat).

టీ20 ప్రపంచ కప్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. వెస్టిండీస్‌ బోర్డుకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. టీ20 ప్రపంచకప్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రధాన ఈవెంట్లను లక్ష్యంగా చేసుకుంటామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ బెదిరించింది. ఐఎస్‌కి చెందిన మీడియా గ్రూప్ ‘నాషీర్ పాకిస్థాన్’ ద్వారా ప్రపంచకప్‌కు ముప్పు పొంచి ఉందన్న నిఘా సమాచారం అందిందని కరీబియన్ మీడియాలో వార్తలు వచ్చాయి.

మరోవైపు ఉగ్రదాడి బెదిరింపుల నేపథ్యంలో వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు అప్రమత్తమైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు సీఈవో (CEO of Cricket West Indies) జానీ గ్రేవ్స్ (Johnny Graves) స్పందిస్తూ.. ‘ప్రపంచకప్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరి భద్రతే మా తొలి ప్రాధాన్యత. ఇందు కోసం కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.

Also Read..

Amethi | అమేథిలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై దాడి.. కార్లు ధ్వంసం

ED Raids | రాంచీలో ఈడీ దాడులు.. మంత్రి వ్యక్తిగత సహాయకుడి ఇంట్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నగదు

PM Modi: ఒడిశా సంప‌న్న‌మైంది..కానీ ప్ర‌జ‌లు పేద‌లుగా మిగిలిపోయారు: ప్ర‌ధాని మోదీ

2024-05-06T05:42:27Z dg43tfdfdgfd