ఆన్‌లైన్ క్రికెట్ పాఠాలు చెప్పిన పాకిస్థాన్ కొత్త కోచ్.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్..!

2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్‌స్టన్‌ ఇటీవల పాకిస్థాన్ వన్డే, టీ20 జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024, వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా పాక్ జట్టు అతడి హయాంలోనే ఆడనుంది. భారత జట్టుకు వన్డే ప్రపంచకప్ అందించిన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న కిర్‌స్టన్.. లీగ్ ముగిశాక కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే అంతకుముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త కోచ్‌తో ఆటగాళ్లతో సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈ భేటీ వర్చువల్‌గా జరిగింది. ఐపీఎల్ కోసం భారత్‌లో ఉన్న గ్యారీ కిర్‌స్టన్.. వీడియో కాల్ ద్వారా ఆటగాళ్లతో సమావేశమయ్యాడు. జట్టును ఉద్దేశించి ప్రసంగించాడు.

గ్యారీ కిర్‌స్టన్ వీడియో కాల్ ద్వారా ఆటగాళ్లతో మాట్లాడిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పంచుకుంది. "పాకిస్థాన్ వైట్ బాల్ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ వర్చువల్ మీట్ అప్‌లో ఆటగాళ్లతో కనెక్ట్ అయ్యారు. లెట్ ద జర్నీ బిగిన్" అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఈ పని.. ఆ దేశ అభిమానులకు కోపం తెప్పించింది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఈ ట్వీట్‌పై పాక్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. క్రికెట్ కూడా ఆన్‌లైన్‌లోనే ఆడండి అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ల్యాప్‌టాప్ స్క్రీన్ ద్వారా.. ఆటగాళ్లు ఎలా నేర్చుకుంటారు అని ఓ యూజర్ ప్రశ్నించాడు.

మరికొందరేమో పాకిస్థాన్ క్రికెటర్లకు ఇంగ్లీష్ అర్థం కాదుగా.. గ్యారీ కిర్‌స్టన్ చెప్పే మాటలు ఏం అర్థం అవుతాయని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అందులోని కొన్ని క్రేజీ కామెంట్లు మీకోసం.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T07:59:17Z dg43tfdfdgfd