న‌రైన్ సెంచ‌రీ మిస్.. రెండొంద‌ల దిశ‌గా కోల్‌క‌తా

LSG vs KKR : ల‌క్నో గ‌డ్డ‌పై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఓపెన‌ర్ సునీల్ న‌రైన్(81) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. సెంచ‌రీ దిశ‌గా వెళ్తున్న న‌రైన్ ఎట్ట‌కేల‌కు ర‌వి బిష్ణోయ్(Ravi Bishnoi) ఓవ‌ర్లో వెనుదిరిగాడు. దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ చేతికి చిక్కాడు. దాంతో, 140 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

ఓపెన‌ర్ ఫిలిప్ సాల్ట్(32) ఔట‌య్యాక‌.. అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ(26)తో కలిసి న‌రైన్ కోల్‌క‌తా ఇన్నింగ్స్‌ను ప‌రుగులు పెట్టించాడు. ఏకంగా రెండో వికెట్‌కు 79 ప‌రుగులు జోడించి ప‌టిష్ట స్థితిలో నిలిపాడు. ఆండ్రూ ర‌స్సెల్ క్రీజులోకి వ‌చ్చాడు. 13 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోర్.. 152/2. ఇంకా ఏడు ఓవ‌ర్లు ఉండ‌డంతో కోల్‌క‌తా మ‌రోసారి రెండొంద‌లు కొట్టేలా క‌నిపిస్తోంది.

2024-05-05T15:10:09Z dg43tfdfdgfd